Hot Posts

6/recent/ticker-posts

సీమ పొలిటిక‌ల్ చిత్రం మారిపోతోందా? వైసీపీలో మార్పులు?

ఏపీలో వ‌చ్చే 2024 ఎన్నిక‌లు కాక రేప‌నున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు.. టీడీపీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టులు ఒక జ‌ట్టుగా రంగంలోకి దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది 

By:  Paschimavahini

ఒక‌వేళ బీజేపీ క‌లిసి వ‌స్తే.. క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో పొత్తుకు తెర‌దీసే అవ‌కాశం ఉంది. దీంతో వైసీపీ ముందుగానే అలెర్ట్ అవుతోంది. ప్ర‌స్తుతం ఎంపీలుగా ఉంటూ.. ప్ర‌జ‌ల‌కు దూరంగా లేక‌, వివిధ ఆరోప‌ణ‌ల‌తో ఇరుకున ప‌డుతున్న వారిని ఎమ్మెల్యేలుగా పంపించాల‌ని చూస్తోంది. 


ఇదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. త‌న మిత్ర ప‌క్షం జ‌న‌సేన‌కు టికెట్లు కేటాయించే నేప థ్యంలో కీల‌క నేత‌లుగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల‌కు ఎంపీ టికెట్లు ఇవ్వాల‌ని చూస్తోంది. దీంతో వారు వీర‌వన‌నున్నార‌నే టాక్ ఇరు పార్టీల్లోనూ జోరుగా వినిపిస్తోంది. రాయ‌ల‌సీమ విష‌యానికి వ‌స్తే.. తిరుప‌తి ఎంపీగా ఉన్న గురుమూర్తిని వైసీపీ గూడూరు ఎమ్మెల్యే సీటుకు ప్రెపోజ్ చేస్తోంది. ఇదేస‌మ‌యంలో ఎమ్మెల్సీగా ఉన్న బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్‌ను ఎంపీగా తిరుప‌తి నుంచి పోటీకి నిలబెట్టాల‌ని భావిస్తున్నారు. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డ‌ప్ప‌ను శాస‌న మండ‌లికి పంపించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నా యి. ఈ స్థానాన్ని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీనివాస్‌కు ఇవ్వాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇక‌, పుంగనూరు ఎమ్మెల్యే క‌మ్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని ఇక్క‌డ నుంచి రాజంపేట‌కు మార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. 


పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని పుంగ‌నూరుకు ఎమ్మెల్యేగా పంపించాల‌ని చూస్తున్నారు. ఇక‌, కోస్తాలోనూ మార్పులు ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోంది. ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీమంత్రి ఆళ్ల శ్రీనివాస్‌ను ఏలూరు ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, ఎంపీగా ఉన్న కోట‌గిరి శ్రీధ‌ర్‌ను దెందులూరు ఎమ్మెల్యేగా రంగంలోకి దింప‌నున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా.. చాలా వ‌ర‌కు మార్పులు దిశ‌గా.. వైసీపీ అడుగులు వేస్తోంది. మ‌రి వీరు ఎంత వ‌ర‌కు విజ‌యం ద‌క్కించుకుంటారో చూడాలి.