ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి జాతి సంపదలు.. విరిసి విరియని కుసుమాలు
సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు -
తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు.. భావి భారత పౌరులు. వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పుదాంమని పిలుపు నిచ్చారు.
పాలబుగ్గల నవ్వులు, అపురూపమైన క్షణాలు.. మరపు రాని జ్ఞాపకాలు, బాల్యం ఒక వరం. బాలల దినోత్సవం ఒక సంబరం అని బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎం జె వి భాస్కర రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఒకరు వద్ద నుండి దోచుకోలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే అది విద్య అని, ప్రతి ఒక్కరు ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రులు యొక్క ఆశయ సాధన కొరకు కష్టపడి పని చేయాలని, 20 సంవత్సరాలు పాటు కష్టపడితే 80 సంవత్సరాల పాటు సుఖపడతారని, ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20వ తేదీని బాలల దినోత్సవం జరుపుకుంటున్నారని, ఇండియాలో మాత్రం ఆరు రోజులు ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14వ తేదీ నాడు బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.
శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో రెండు విభాగాలలో యూకేజీ నుండి 5వ తరగతి వరకు ఒక విభాగం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక విభాగంలో నిర్వహించి గేమ్స్ లలో ప్రధమ, ద్వితీయ, ద్వితీయ పోటీలలో గెలుపొందినటువంటి బాల బాలికలకు జిల్లా ఎస్పీ చేతులు మీదుగా బహుమతి ప్రధానం చేసారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సురేష్ చంద్ర బహగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ వి స్రవంతి, ఆర్ఎస్ఐ నరేంద్ర, స్కూల్ అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.