-ముఖ్యమంత్రికి పట్టణంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు.
-నూజివీడులో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం..
-బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగానికి ప్రజలు పెద్దఎత్తున స్పందన..
నూజివీడు: నూజివీడులో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ప్రజల్లో జోష్ నింపింది. ఉదయం హెలికాప్టర్ లో నూజివీడు చేరుకున్న ముఖ్యమంత్రి హెలిపాడ్ నుండి సభా వేదిక వరకు బస్సులో చేరుకున్నారు. ముఖ్యమంత్రి వాహనం హెలిపాడ్ నుండి బయలుదేరిన దగ్గరనుండి దారికిరువైపులా పెద్దఎత్తున ప్రజలు పూలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యంగా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్, వంటి పలు ప్రాంతాలలో వేలాదిమంది ప్రజలు ముఖ్యమంత్రిని చూసేందుకు ఆసక్తి చూపారు.
ముఖ్యమంత్రి ప్రజలందరికీ ముకుళిత హస్తాలతో, చిరునవ్వుతో నమస్కారం చేశారు. సభాస్థలికి చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రజలు హర్షద్వానాలతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రజలు ముఖ్యంగా యువత జై జగన్.. జగనన్న.. నువ్వే మా భవిష్యత్తన్నా .. అంటూ ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంతసేపు ముఖ్యమంత్రికి మద్దత్తు పలుకుతూ పెద్దఎత్తున హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు.
నూజివీడులో ముఖ్యమంత్రి పర్యటనకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేందుకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా యంత్రాంగంతో సమన్వయం, పటిష్ట ప్రణాళికతో చేసిన ఏర్పాట్లను పలువురు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఏమన్నారంటే..
- నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికలకు ముందు నూజివీడు భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. అయితే ఈ హామీలు అన్నీ అవుతాయా అనే భయం నాలో ఉండేది. కానీ.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిది.
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
- నూజివీడు ప్రాంతం మెట్ట, అటవీ, పోరంబోకు భూములతో ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసైన్ కమిటీలు ఏర్పాటు చేసి.. భూమిలేని పేదలకు వేలాది ఎకరాలు పంపిణీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు పట్టాలు అందిస్తున్నారు.
- ఇటీవల మన ప్రాంతంలో దాదాపు 40 వేల మందికి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరింది.
- వేలాదిమందికి ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లు కూడా కట్టిస్తున్నారు. - రాష్ట్రంలో జగనన్న అమ్మవొడి, జగనన్న తోడు, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, వైయస్సార్ వాహన మిత్ర తదితర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. -
- దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి.. కృష్ణానది నీటిని నూజివీడుకు తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చారు.
- ఎం.ఆర్.అప్పారావు కాలనీలో 5000 ఇళ్లకు శంకుస్థాపన చేశారు.
గౌరవ ముఖ్యమంత్రి హామీలు
- నూజివీడు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి. మునిసిపాలిటీ పరిధిలో 16 వార్డు సచివాలయాలు ఉన్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (జీజీఎంపీ) కింద ఒక్కో సచివాలయం పరిధిలో అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు.
- నూజివీడు ప్రాంతంలోని మామిడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ. 275 కోట్లతో మామిడి గుజ్జు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డిపీఆర్) తయారు చేసి బ్యాంకులకు పంపించడం జరిగింది.
- చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేసేందుకు చర్యలు.