Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడి నగర పంచాయతీ లో హెల్మెట్ అవగాహన ర్యాలీ


 ఏలూరు జిల్లా : చింతలపూడి పోలీస్ అధికారులు మరియు శ్రీ చైతన్య టెక్నో కరిక్యులం స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా హెల్మెట్ అవగాహన ర్యాలీ చేపట్టారు.


ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. వి. ఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం రోడ్లపై జరుగు ప్రమాదాలలో సగటున రోజుకి 56మంది ప్రాణాలుకోల్పో తున్నారని అన్నారు. అలాగే వందలాది మంది గాయ పడుతున్నారని దీనివలన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని తెలిపారు. ఈ ప్రమాదాల వలన జరిగే నష్టం ఒక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ కి సమానమని చెప్పారు. ప్రమాదాలకి ప్రధాన కారణం నిర్లక్ష్యం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపటం, ఆటోలలో పరిమితికి మించి జనాలతో వెళ్ళడం, అతివేగం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయడం మొదలగు కారణాలు గురించి అవుతున్నాయని అన్నారు. ప్రమాదాల వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు వేల కోట్ల నష్టం ప్రభుత్వానికి జరుగుతుందని, కాబట్టి ప్రజలందరూ కూడా భద్రత ప్రమాణాలు పాటించి, తమకు నష్టం జరగకుండా, ఎదుటివారు నష్టపోకుండా, హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేయాలనికోరారు.


ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐ మల్లేశ్వరరావు, ఎస్సై ప్రసాద్, శ్రీ చైతన్య ప్రిన్సిపల్ సురేష్, డి మధు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.