ఏలూరు/ కైకలూరు: ప్రజల కోసం పనిచేసే కైకలూరు తాసిల్దార్ కార్యాలయం ప్రజా కార్యాలయం అని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. కైకలూరు మండల తాహసిల్దార్ కార్యాలయాన్ని శాసన మండలి సభ్యులు జయ మంగళ వెంకటరమణ, స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావులతో కలిసి ఏలూరు జిల్లా కలెక్టర్ వె .ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కైకలూరు తాహసిల్దార్ కార్యాలయాన్ని ప్రజల కోసం పనిచేసే కార్యాలయమని ఇది ప్రజా కార్యాలయం అని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సర్వీస్ సేవలు అందించడం కోసం కోసం కార్యాలయాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు.
18 నెలల క్రితం తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు కార్యాలయ పరిస్థితిని శాసనసభ్యుల వారీ దృష్టికి తీసుకువచ్చి భవనాన్ని పూర్తిచేసే బాధ్యత చేపట్టాలని కోరడం జరిగిందని, దీనికి శాసనసభ్యులు వెంటనే స్పందించి దాతల సహకారంతో కార్పొరేట్ కార్యాలయం స్థాయిలో కార్యాలయాన్ని తీర్చిదిద్దారని తెలిపారు.
ప్రభుత్వ నిధులతో పాటు ప్రజలు, వివిధ సంస్థలు, దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తే మరిన్ని మంచి భవనాలు నిర్మించుకోవచ్చు అని అన్నారు. స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ కైకలూరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంటున్నారని తెలిపారు. కైకలూరులో జగనన్న గ్రీన్ లేఔట్ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోనే మోడల్ జగనన్న లేఔట్ గా గుర్తింపు వస్తుందని తెలిపారు.
కొల్లేరు ప్రాంతంలో ఆక్వా ఇండస్ట్రీస్, ఇతర పరిశ్రమలకు పర్మిషన్ ఇవ్వడం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూలధనంలో కైకలూరు, కలిదిండి మండలాలూఎక్కువ సమకూర్చడం జరుగుతుందని, జిడిపి డెవలప్మెంట్ కూడ ఎక్కువ అని, ఇది ఇక్కడున్న ప్రజలు శాసనసభ్యుల కృషి అని అన్నారు. ఈ కార్యాలయ భవనానికి నిర్మాణానికి దాతల సహకారం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.
రెవిన్యూ సంబంధించిన 20 సంవత్సరాలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములు సాగు చేసుకునే రైతులకు భూమి హక్కును కల్పిస్తూ పత్రాలను రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఈనెల 17వ తేదీన నూజివీడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఏలూరు జిల్లాలో సుమారు 8000 మందికి ఈ పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గం అభివృద్ధికి శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ ఎంతగానో తోడ్పాటు ఇచ్చి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నరని తెలిపారు. ఈ నియోజకవర్గం ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు అమలులో, అభివృద్ధి పనుల్లో ముందు ఉన్నదని తెలిపారు. ప్రజలు సహకారంతో ఇది సాధ్యపడుతుందన్నారు. టూరిజం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఐలాండ్ పరిశీలించి ఆర్ అండ్ బి రోడ్డు నోట్ ఫైల్ చేయించి ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు
స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కైకలూరు తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం నిర్మాణానికి మొదటిదిగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రోత్సాహంతో ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో రాష్ట్రంలో లేని విధంగా కార్యాలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. నియోజవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్సీ, కలెక్టర్, ప్రజలు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం ఎంతగానో ఉందని. ఈ అభివృద్ధికి వారు ఇచ్చే తోడ్పాటు శాసనసభ్యులుగా ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ నూతన భవనం ఏర్పాటు ద్వారా గతంలో పాత భవనంలో రికార్డులు వానకు తడిసి చాలా ఇబ్బంది పడేవారని అన్నారు. ఈ భవన నిర్మాణ పనులు తాహాసిల్దార్ పర్యవేక్షణలో భవనం మంచిగా నిర్మాణం జరిగిందని తెలిపారు. ఈ భవ నిర్మాణాన్ని ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, దాతలకు, రెవెన్యూ అధికారులు సిబ్బందికి, శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్సీ, స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను సత్కరించారు. అలాగే కార్యాలయ నిర్మాణానికి సహకరించిన దాతలను కూడా కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముందు నూతన తాహాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. అనంతరం నూతన గదులను సోలార్ ప్లాంట్ ను విఐపి గదిని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎన్ ఎస్ కే ఖజావలి, ఎంపీపీ అడవి వెంకట కృష్ణ మోహన్, సర్పంచి దానం మేరీ నవరత్న కుమారి, జడ్పిటిసి కూరెళ్ళ బేబీ, తాసిల్దార్ మురళీకృష్ణ, జహీర్ దీపక్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, రామలింగరాజు, వశిష్ట కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మంతెన నాగరాజు ఇతర దాతలు, సర్పంచులు ఉపసర్పంచులు, ప్రజలు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.