ముఖ్యమంత్రి జగనన్న సురక్ష పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పథకం అమలుకు సంబంధించి అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం, సమన్వయంతో ప్రతి ఇంటినీ సందర్శించనున్నట్లు తెలిపారు. అర్హత ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే గుర్తించి, సమస్య పరిష్కారానికి దరఖాస్తులు నింపి, అవసరమైన పత్రాలను సేకరిస్తారన్నారు. సేకరించిన పత్రాలకు టోకెన్ ను వాలంటరీలు అందజేస్తారని, గ్రామంలో మండల స్థాయి అధికారులు ఏ రోజున క్యాంపు నిర్వహిస్తారో తెలియజేస్తారని చెప్పారు.
జులై 1వ తేదీ నుంచి తహసీల్దార్, ఈవోపీఆర్‌డీతో కూడిన ఒక బృందం, ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్‌తో కూడిన మరో బృందం సచివాలయాల వారీగా క్యాంపులు నిర్వహించి అక్కడికక్కడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారన్నారు. అదే విధంగా కార్యక్రమంలో జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఆధార్‌కు ఫోన్ నెంబరు అనుసంధానం, సీసీఆర్‌సీ కార్డులు, కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన, కుటుంబ వివరాల్లో మార్పులు వంటి 11 రకాల సేవలను ఉచితంగా అందించనున్నట్లు వివరించారు.
నెల రోజుల పాటు జరిగే కార్యక్రమంలో జగనన్న సురక్ష శిబిరాల ఏర్పాటుకు ప్రత్యేకంగా చేయాలని కలెక్టర్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. తాగునీరు, భోజన సదుపాయం కూడా కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడి సర్వే వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాణి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.