Hot Posts

6/recent/ticker-posts

వర్షాన్ని లెక్క చేయకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి


జోరు వానలో ప్రతీ ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అమలు గురించి తెలుసుకున్న మంత్రి డాక్టర్ సీదిరి


మంత్రి రాకతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అతని అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగిన సిరిపురం పంచాయతీ ప్రజలు


ఈరోజు మందస మండలం, సిరిపురం పంచాయతీలో సర్పంచ్ గుడియా హేమలత సాహు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "గడప-గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ మరియు మత్స్యశాఖమాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు కలిసి పాల్గొన్నారు. అడుగడుగునా మంత్రివర్యులు డాక్టర్ సీదిరి కి మహిళలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్ళి సాంకేతిక కారణాలు వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాని వారిని గుర్తించి తక్షణమే అధికారుల సమక్షంలో పరిష్కారం కల్పించారు.

ఈసందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతీ కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు వివరాలు ప్రతీ గడపకు వెళ్లి వివరించి ప్రతీ అక్క చెల్లెమ్మను పలకరించారు. అలాగే నేడు మన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పార్టీలకతీతంగా, వర్గాలకతీతంగా., రాజకీయాలను సైతం పక్కన పెట్టి ప్రతి ఇంటి తలుపులు తట్టి సంక్షేమ పథకాలు సచివాలయం వ్యవస్థ ద్వారా అందించడం జరుగుతుందని ఈసందర్భంగా ప్రతీ మహిళకు తెలియజేశారు. అలాగే ఈ పంచాయతీ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని., ఇప్పటికే ఈ వార్డుకి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఆయన అన్నారు.


రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని, జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని ఈ సందర్బంగా ప్రతి అక్కని, ప్రతి చెల్లమ్మని, ప్రతి సోదరుడిని, ప్రతి అవ్వని, తాతని కోరారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సీదిరి తోపాటు ఎంపిపి డొక్కరి దానయ్య, మండల పార్టీ అధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, ఎంపిడిఓ తిరుమల రావు, జడ్పిటిసి చంద్రమ్మ, ఏపియం గొడబ ప్రసాదరావు, క్లస్టర్ ఇంచార్జులు సురేష్ పానిగ్రహి,  డిల్లి జానకి రెడ్డి, ఉప సర్పంచ్ దున్న ముని నరేంద్ర, ఎంపీటీసీ రమేష్ పానిగ్రహి, కురా సాహు, సూర్యనారాయణ సాహు, కొల్లాన సోమేశ్వర రావు, సచివాలయం కన్వీనర్ నగిరి పద్మనాభం, డా రామచంద్ర మహాంతి, పొత్తంగి సర్పంచ్ డల్లి కిరణ్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ గున్న రమణ, సర్పంచులు, ఎంపీటీసీలు, యూత్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, శక్తి కన్వీనర్లు, సోషల్ మీడియా కన్వీనర్లు, గృహసారదులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.
BCN OTT
app Download link 
BCN TV LIVE link 

SANA TV LIVE link 
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.
ELURU FM (All songs)
app DOWNLOAD link