రీసెంట్‌గా స్టార్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన మెగాస్టార్.. అక్కడి డాక్టర్స్‌తో సినీ కార్మికులకు, జర్నలిస్ట్‌లకు, అభిమానులకు క్యాన్సర్‌ని ముందస్తుగా గుర్తించేలా టెస్ట్‌లు చేయగలిగితే.. అందుకు ఎంత ఖర్చు అయినా తనే భరిస్తానని ప్రకటించారు. ఆ క్యాన్సర్ సెంటర్ వారు కూడా చిరు కోరికను తీర్చేలా.. పక్కా ప్రణాళికతో సిద్ధమవడంతో.. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి.. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లను జూలైలో మూడు ప్రదేశాలలో చేయబోతున్నట్లుగా మెగాస్టార్ తెలియజేశారు. జూలై 9న హైదరాబాద్, 16న వైజాగ్, 23న కరీంనగర్‌లో రోజుకు వెయ్యి మంది చొప్పున వివిధ క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అభిమానులు, సినీ కార్మికులు, జర్నలిస్ట్‌లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోనూ, అలాగే ఇకపై కూడా అభిమానులు, సినీ కార్మికులు, జర్నలిస్ట్‌లకు ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాకుండా.. చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలోనూ కొంత సబ్సిడీ అందేలా స్టార్ క్యాన్సర్ సెంటర్‌వారు, తను కలిసి ఓ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా మెగాస్టార్ చెప్పుకొచ్చారు. దీనిపై ప్రస్తుతం మాట్లాడుకుంటున్నామని, త్వరలోనే సినీ కార్మికులకు, జర్నలిస్ట్‌లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని, దాని ద్వారా భవిష్యత్‌లోనూ చికిత్సలు చేయించుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగానూ, అలాగే క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా కొన్ని లఘు చిత్రాలను కూడా రూపకల్పన చేయబోతున్నట్లుగా చిరంజీవితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ మన్నె గోపీచంద్, డాక్టర్స్ సాయి, బిపిన్‌లు తెలిపారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.