ఏలూరు, పశ్చిమ వాహిని, మే 10: రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆర్‌సీఎం చర్చిలో యువత, మహిళలు, నాయకులు కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.
తేనేటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి మరింత సేవ చేసే శక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే కుటుంబంపై దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రజల మధ్య చురుకుగా ఉంటూ సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కలరాయనగూడెం గ్రామ యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


