ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి , 23 : ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి గొప్ప సంఘ సంస్కర్త ని, స్వాతంత్య్ర సంగ్రామంలో జాతీయోద్దరణకు కృషి చేశారన్నారు. ముఖ్యంగా సమాజంలో విద్య ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి, ప్రజలను విద్యావంతులను చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ఆదేశించిందన్నారు.
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, సర్వే శాఖ ఏడి అన్సారీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, బిసి కార్పొరేషన్ ఈడి పుష్పలత, శెట్టిబలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఇళ్ల వరప్రసాద్, ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జుత్తిగ శ్రీనివాస్, పంపన వెంకటరమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసది శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు వనము నరసింహారావు, ట్రెజరర్ గుబ్బల దుర్గ రావు, సభ్యులు దంపబోయిన రఘు, బండి కైలాసపతి, ప్రభృతులు పాల్గొన్నారు.








