నూజివీడు, పశ్చిమవాహిని, మార్చి 18: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నూజివీడులో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనపల సురేష్ ఆదేశాల మేరకు, చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన బీజేపీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నూజివీడు పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలకు చీరలు, మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారత లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.
మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు, క్రీడలు తదితర రంగాల్లో ముందంజలో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్య మహిళా సిబ్బంది గ్రామాల్లో శుభ్రత కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
శరణాల మాలతీరాణి మాట్లాడుతూ ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం విద్యావంతమవుతుందని, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని అన్నారు.
జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ మహిళలు, పురుషులు సమానులని, పిల్లలకు మొదటి గురువు తల్లేనని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పులు సాధ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ కమిషనర్ కె. పేరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నగడపాటి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షురాలు మల్లిపూడి నాగరాణి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇలపర్తి కుసుమ కుమారి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కీర్తి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



.jpeg)








