తాజా వార్తలు

10/recent/ticker-posts

వేములపల్లిలో పోలీసుల పల్లె నిద్ర – చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ వెంకన్న


ఏలూరు జిల్లా లింగపాలెం, పశ్చిమ వాహిని, మార్చి, 22: మండలం వేములపల్లి గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న తమ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.


గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకున్న ఎస్ఐ, చట్టాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పలు అంశాలను వివరించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ మరియు మద్యం దుర్వినియోగం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు.

అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు. బాలల హక్కులు, బాల్యవివాహాల నివారణపై కూడా అవగాహన కల్పించారు.

గ్రామాల్లో కోడిపందాలు, పేకాట, నాటు సారా వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిఘా ఉంచుతున్నామని చెప్పారు.

ప్రజల సహకారంతోనే నేర రహిత సమాజం సాధ్యమని, పోలీసులపై విశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని ఎస్ఐ వెంకన్న తెలిపారు. గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.