తాజా వార్తలు

10/recent/ticker-posts

పాలగూడెంలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ – 12 బైక్‌లు, కారు స్వాధీనం


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 22: నేరాల నియంత్రణ, ప్రజల భద్రత దృష్ట్యా ఏలూరు రూరల్ పోలీస్ పరిధిలోని పాలగూడెం ఇందిరమ్మ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి జయ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటిని, అనుమానాస్పద ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు మరియు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల అనంతరం కాలనీ వాసులతో సమావేశమైన ఐపీఎస్ అధికారి జయ శర్మ, కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం పోలీసులకు అందించాలని కోరారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేయాలని ప్రజలకు సూచిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.