తాజా వార్తలు

10/recent/ticker-posts

టి. నరసాపురం సహకార సంఘం సీఈవోగా సోలా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరణ


టి. నరసాపురం, జనవరి 30: టి. నరసాపురం సహకార సంఘం సీఈవో (కార్యదర్శి)గా సోలా సత్యనారాయణ శుక్రవారం అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.


ఈ సందర్భంగా సంఘ చైర్‌పర్సన్ సోంబాబు మాట్లాడుతూ, చిన్న వయసులోనే ఇంతటి బాధ్యత స్వీకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. బాధ్యతతో విధులు నిర్వహిస్తూ సంఘ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని ఆయన సూచించారు. అలాగే సోలా సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు.