టి.నరసాపురం, జనవరి 30: సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పోరాడి యావత్ భారతజాతికి స్వేచ్ఛా–స్వాతంత్ర్యాలను అందించిన మహనీయుడు మన జాతిపిత మహాత్మాగాంధీ అని టి.నరసాపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అద్దంకి గిరి కుమార్ పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరి కుమార్ మాట్లాడుతూ, గాంధీజీ చూపిన అహింసా మార్గం నేటికీ దేశానికి, సమాజానికి దారి చూపే వెలుగురేఖ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కోశాధికారి కొనకళ్ల శ్రీను, సంఘ మాజీ అధ్యక్షులు మాదంశెట్టి మల్లిఖార్జునరావు, మాజీ కార్యదర్శి జూలూరి గోపి, అద్దంకి రవి, సభ్యులు మండం ఆదిత్య, కొనకళ్ల మోహన్ కుమార్, కొనకళ్ల కాశి, మాటూరి రవి, పమిడి పుల్లారావు, నల్లూరి శ్రీనివాస్, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే మహాత్మాగాంధీ అభిమానులు శివయ్య, చిన్నం బుజ్జితో పాటు అధిక సంఖ్యలో గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొని గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.







