Hot Posts

6/recent/ticker-posts

పడమరవీధి గంగానమ్మ జాతరలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం


ఏలూరు, డిసెంబర్ 15 : ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న పడమరవీధి గంగానమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర కమిటీ చైర్మన్ చోడే బాలసుబ్రహ్మణ్యం, చోడే వెంకటరత్నం ఆలయ మర్యాదలతో హోం మంత్రికి ఘన స్వాగతం పలికారు.


జాతరలో భాగంగా మేడలపై కొలువుదీరిన శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబులను హోం మంత్రి దర్శించుకొని సారెను సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్‌లతో కలిసి అమ్మవారికి చీరను కానుకగా సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర శాంతియుతంగా, ఘనంగా కొనసాగాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ నెంబర్ ఎస్.ఎం.ఆర్. పెదబాబు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, పూజారి నిరంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.