Hot Posts

6/recent/ticker-posts

బండారు బ్రదర్స్ లో "బ్రహ్మానందం" ఎవరో "ఆలీ" ఎవరో మీరే చెప్పాలి: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి


8వ వింతగా కొత్తపేట నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ పెట్టిన పిరమిడ్ ఇసుక కొండలకు కచ్చితంగా పేరు వస్తుంది..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రజలపై జరిగిన అక్రమాలకు అన్యాయాలకు మీరు నిన్న విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారా?

జగన్ గారు ఇచ్చిన అమ్మఒడిగాని, చేయూతగాని, కాపు నేస్తం గాని, చంద్రబాబు ఇస్తే మీరు ఏ పండగ అయినా చేసుకోండి పర్వాలేదు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం: మండలంలోని రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి గురించి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలలో అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకి తెలుస్తుంది అన్నారు . 

బెల్ట్ షాపుల్లో మీరు వసూలు చేసే బీటాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం గురించి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.