ANDRAPRADESH: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..ఈ ఇద్దరి నేతలకు కష్టకాలం మొదలైంది. వల్లభనేని వంశీ అరెస్టు కావటం.. కోర్టు నుంచి బెయిల్ వచ్చినా.. ఇంకో కేసులో అరెస్టు అవుతున్నారు. By: PASCHIMA VAHINI రాజకీయం అన్న తర్వాత ప్రత్యర్థులు.. శత్రువులు ఉంటారు. ఎంత రాజకీయం అయితే మాత్రం వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. విధానపరంగా ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ.. ప్రతి ఒక్కరికి ఉండే లక్ష్మణ రేఖను దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ విషయంలో వైసీపీ నేతలు వల్లభనేని వంశీ.. కొడాలి నాని ఇద్దరూ పూర్తిగా హద్దులు దాటేసిన వైనం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వారే. అలాంటి వారు.. చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎంతలా మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి సంగతి చూస్తామన్న విషయాన్ని ఓపెన్ చెప్పటమే కాదు.. అంతకు మించి శపధాలు చేసిన వైనం తెలిసిందే. కొడాలి నానిని డ్రాయిర్ మీద కొట్టుకుంటూ గుడివాడ సెంటర్లో నడిపిస్తామంటూ లోకేశ్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించటం తెలిసిందే.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..ఈ ఇద్దరి నేతలకు కష్టకాలం మొదలైంది. వల్లభనేని వంశీ అరెస్టు కావటం.. కోర్టు నుంచి బెయిల్ వచ్చినా.. ఇంకో కేసులో అరెస్టు అవుతున్నారు. ఇలా నెలల తరబడి అతను జైల్లో ఉండటమే కాదు.. రెండు నెలల వ్యవధిలో దాదాపు పది కేజీలు తగ్గిపోవటమే కాదు.. కోర్టుకు హాజరయ్యే సందర్భంలో తీసిన వీడియోలు చూస్తే.. ఎలాంటి వంశీ ఎలా అయ్యారో అన్న భావన కలిగేలా పరిస్థితి మారింది. ఓవైపు వంశీ పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు కొడాలి నాని మీదా కేసులు నమోదు కావటం తెలిసిందే. అయితే.. గుండె సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఆసుపత్రిలో చేరారు. నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ కంప్లైంట్ చేసింది.దీంతో.. అనారోగ్యం పేరు చెప్పి అమెరికాకు వెళ్లేందుకు నాని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి వేళ.. నానికి షాక్ తగిలింది. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో.. ఆయన విదేశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడినట్లుగా చెప్పాలి. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న కొడాలి నాని.. ఆ మధ్యన ముంబయిలోని ఆసుపత్రికి షిప్టు కావటం తెలిసిందే. తాజాగా జారీ అయిన లుకౌట్ నోటీసుల నేపథ్యంలో కొడాలి నాని విదేశాలకు వెళ్లే అవకాశాలు మూసుకుపోయినట్లుగా చెప్పాలి. మరోవైపు.. కొడాలి నానిని అష్ట దిగ్బంధనం మొదలైందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.