Hot Posts

6/recent/ticker-posts

డైరెక్టర్ అపోస్తులు కె. మోజెస్ & జాయ్ మోజెస్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్


కాకినాడ జిల్లా, రామచంద్రపురం/కాజులూరు ప్రతినిధి: మండలంలోని కాజులూరు చాకి రేవు మెరక కార్నర్ స్టోన్ ఫుల్ గాస్పల్ చర్చ్ ఇండియా తరుపున CFGM వ్యవస్థాపకులు, డైరెక్టర్ అపోస్తులు కె. మోజెస్ & జాయ్ మోజెస్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ & కార్నర్ స్టోన్ క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది.

స్థానిక దైవజనులు లంక రాజ్ కుమార్ చర్చిలో  
అపోస్టల్ K. మోజెస్ ప్రారంభించారు. అనంతరం మోజేస్ మాట్లాడుతూ నేటి కాలంలో చాలా అట్టడుగు బలహీన వర్గాల నివాసం చేస్తున్న కొన్ని కొన్ని గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు ఆరోగ్యం కాపాడుకొనుటకు చిన్న పెద్ద బలహీనతలకు రోగాలకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక అనేకమంది ఉన్నారని అన్నారు.


గవర్నమెంట్ ఇటువంటి ఉచిత వైద్యం అందించినప్పటికీ కార్నర్ స్టోన్ ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ ఉచిత మెగా మెడికల్ వైద్య శిబిరం ఏర్పాటు చెయ్యాలి అనే దృక్పథంతో పేదప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశం కలిగి ప్రజల సంక్షేమం నిమిత్తమై కార్నర్ స్టోన్ ఉచిత క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఆదివారం ఉచిత వైద్యం చేస్తారని చెప్పారు.

స్థానిక దైవజనులు లంక రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఈ ఉచిత వైద్య శిబిరం లేక క్లినిక్ మా గ్రామంలో మా దగ్గర జరగడం మాకు చాలా సంతృప్తిని కలుగ చేస్తుందని తెలియజేశారు. కారణం అనేకమంది పేద ప్రజలైన వారు ఈ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. 

కార్నర్ స్టోన్ సీనియర్ సలహాదారులు K.ప్రభుదాస్ (హైదరాబాద్) మాట్లాడుతూ.. కాజులూరు మండలంలో ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని తెలియజేశారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని తెలియజేశారు.

పేషెంట్స్ కు జనరల్ చెకప్ బీపీ, షుగర్, కంటి, దంతాలు టెస్ట్లు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో టెస్టులతో పాటుగా ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది

Dr.సురేంద్ర
MEM. CRITICAL COMMUNITY HEALTH OFFICER, KAJULURU 
 
Dr.V.V.V.S.N.జోసఫ్ 
కంటి వైద్య నిపుణులు(ముమ్మిడివరం) 

Dr.పోలరావు 
దంత వైద్య నిపుణులు(గొల్లపాలెం) 

వచ్చి వైద్యం అందించారు. 500 మంది కాజులూరు మండలంలో ఉన్న చుట్టుపక్క గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఈ వైద్యమును ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కార్నర్ స్టోన్ ఫుల్ గాస్పల్ చర్చ్ కోఆర్డినేటర్స్ దైవజనులు Ch. ఆశీర్వాదం J. చంటి బాబు వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.