విగ్రహనికి పూలమాలలు వేస్తున్న ఆర్యవైశ్య సంఘ సబ్యులు |
టి నరసాపురం / ఏలూరు జిల్లా: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమే అంధ్రరాష్ట్ర అవతరణ అని రాష్ట ప్రజలు ఆయన త్యాగాన్ని నిరంతరo గుర్తుoచుకోవాలని టి నరసాపురం ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు అద్దంకి గిరి అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు..
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ పలితమే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజును ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం శ్రీరాములు 1952లో 58 రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహించారని గుర్తుకు చేశారు. అతని త్యాగం ఫలితంగా మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగువారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరణ జరిగి, కర్నూలు ప్రధాన నగరంగా నిర్ణయించారని తెలిపారు. శ్రీరాములుని త్యాగం భారతదేశంలో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు మార్గదర్శకమైందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో తెలుగు ప్రజల ఆత్మగౌరవం పెరిగిందని, పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటాంమని అన్నారు. ఈ దినం తెలుగు సంస్కృతి, భాషా విలువల కోసం అంకితభావాన్ని ప్రదర్శించే రోజుగా గుర్తించబడిందని, ఆంధ్ర రాష్ట్రం తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిన ఈ ఘట్టం భారతదేశ చరిత్రలో త్యాగం, సమైక్యతకు నిలువుటద్దంగా నిలిచిందని చెప్పారు.
అనంతరం టి నరసాపురం ప్రధాన సెంటర్ లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మండల యువజన సంఘం అధ్యక్షులు పసుమర్తి రాము, పర్వతనేని మురళీ, అద్దంకి మహేశ్వరరావు, వీరంకి సత్యనారాయణ, కొండపల్లి రవి, పద్మనాభుని ఫని, నల్లూరి శ్రీను, యలమంచి వాసు, పత్తి వెంకటేశ్వరరావు, తదితరులు ఆర్యవైశ్య సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.