Hot Posts

6/recent/ticker-posts

ఎంపీ - ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు... అధికారిని వరించిన టిక్కెట్!


 ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధ‌ర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని అంటున్నారు.   

రాజకీయాల్లో కొన్ని సంఘటనలు బలేగా అనిపిస్తుంటాయి! ఏదో ఊహించుకుంటే.. మరేదో జరుగుతుంటుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే... నాయకులు ఒకటి తలిస్తే.. అధినేత మరొకటి తలిచారన్నట్లుగా! ప్రస్తుతం ఏలూరు లోక్ సభ స్థానం పరిధిలో జరుగుతున్న అధికార పార్టీ రాజకీయాలు ఇలానే అనిపిస్తున్నాయి. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా సాగుతున్న ఈ పోరులో భారీ ట్విస్ట్ నెలకొందని తెలుస్తుంది. 


ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధ‌ర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో ఎంతో అన్నోన్యంగా కనిపించి, కలిసి మెలిగిన వీరిద్దరూ ఒకరిపై ఒకరు అధిష్టాణానికి ఫిర్యాదు చేసుకునేవరకూ వ్యవహారం వచ్చింది. కారణం ఏదైనా ఇది స్థానికంగా కేడర్ లో కలకలం రేపింది. 


ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో ఏలూరు జిల్లా చింతలపూడి వైకాపా టికెట్‌ ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజాకు కేటాయించే అవకాశం లేదని జగన్ తేల్చి చెప్పేశారని తెలుస్తుంది. అవసరమైతే అమలాపురం ఎంపీగా పోటీచేయమని సూచించారని అంటున్నారు. అయితే... ఆ ఛాయిస్ ని ఎలీజా ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... ఎలీజాకే టిక్కెట్ కన్ ఫాం చేయాలని ఆయన అనుచరులు తాడేపల్లిలో నిరసనకు దిగారు. ఇక‌, నియోజకవర్గంలోని నలుగురు జడ్పీటీసీల్లో ముగ్గురు ఎస్సీలే కావడంతో వారికి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పిస్తానని ఆశ చూపి.. ఎంపీ శ్రీధ‌ర్ మోసం చేస్తున్నార‌ని.. ఇదే సమయంలో చింతలపూడి ఎమ్మెల్యే సీటును బలహీనమైన వ్యక్తికి ఇప్పించేలా ఎంపీతో పాటు ఆయన వర్గీయులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఎలీజా వర్గం ఆరోపిస్తుంది. ఎంపీ గతంలో తన బంధువుకు జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ పదవి ఇప్పించాలని అనుకున్నారని, అయితే అది బీసీ మహిళలకు కేటాయించడంతో ఎమ్మెల్యేపై ఆయన పగ పెంచుకున్నారని అంటున్నారు. 

 

నాటి నుంచి మొదలు... ఎలీజాపై అవకాశం ఉన్నపుడల్లా అధిష్టాణం వద్ద ఫిర్యాదులు చేశారని చెబుతున్నారు. ఇలా వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న క్రమంలో... అటు శ్రీధర్ రికమండ్ చేసిన వారికి కానీ, ఇటు ఎలీజాకు కానీ ఎమ్మెల్యే టిక్కెట్ దక్కే అవకాశం లేదని, ఆ విషయం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయిందని తెలుస్తుంది! ఈ గ్యాప్ లో ఈ స్థానానికి వైసీపీ తరఫున రవాణా శాఖలోని ఓ అధికారి పేరు బయటకు పొక్కింది. దీంతో... ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటే... ఇద్దరికీ దక్కకుండా మధ్యలో ఒక ప్రభుత్వ అధికారి టిక్కెట్ తన్నుకుపోయారనే చర్చ నియోజకవర్గంలో వినిపిస్తుంది.