Hot Posts

6/recent/ticker-posts

ఎల్ట్రానిక్స్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్


ఏలూరు: ఈవీఎంలు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్  కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లో ఈవీఎంలు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్  తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీన ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని, నవంబర్ 10వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందని, సజావుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.ఎఫ్ ఎల్ సి నిర్వహిస్తున్న గోడౌన్ లోపలికి వెళ్ళినప్పుడు  సంబంధిత రిజిస్టర్ లో ఆయన సంతకం చేశారు.


ఈ కార్యక్రమంలో డిఆర్ఓ యం.వెంకటేశ్వర్లు, ఎఫ్ ఎల్ సి పర్యవేక్షకులు,డి ఆర్ డి ఎ పిడి డా. ఆర్.విజయారాజు,ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్నదొర తదితరులు వున్నారు.