తాజా వార్తలు

10/recent/ticker-posts

గాడిదబోరు గ్రామంలో ఓణీల వేడుకలో ఎమ్మెల్యే బాలరాజు సందడి


ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, పశ్చిమ వాహిని, మార్చి, 22: మండలంలోని గాడిదబోరు గ్రామంలో నిర్వహించిన ఓణీల వేడుకకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన మండల అధ్యక్షుడు మెట్ట బుచ్చిరాజు కుమార్తెకు ఆశీర్వాదాలు అందజేసి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ వేడుకలు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఇటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం ఆనందదాయకమని పేర్కొన్నారు. పిల్లలు విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

వేడుక సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారికి ఆశీర్వాదాలు అందిస్తూ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడపా నాగరాజు, తోట రవి, గుణపర్తి చిన్ని, మాదేపల్లి శ్రీనివాస్, తుష్టి చిన వెంకటేష్, జీఎస్‌ఎన్ నాయుడు, తీగల గోపాలకృష్ణ, సింగంశెట్టి మోహన్ తదితరులు పాల్గొన్నారు.