ANDRAPRADESH, KADAPA: టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న మహానాడు ఈ నెల 27-29 వరకు మూడు రోజులు నిర్వహించేం దుకు యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. ఈ మహానాడుకు రెండు ప్రధాన ప్రత్యేకతలు ఉన్నా యి. 1) తొలిసారి ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇలాకా కడపలో నిర్వహిస్తుండడం. 2) కూటమి విజయం దక్కించుకున్న సంబరంలో నిర్వహిస్తుండడం. ఈ రెండు కారణాలకు తోడు చంద్రబాబుకు 75 వసంతా లు పూర్తికావడం.. యువ నాయకుడు లోకేష్ పుంజుకుంటున్న తీరు కూడా తోడైంది.
ఈ పరిణామాలతో పాటు.. వచ్చే 15 సంవత్సరాల వరకు కూడా కూటమి బలంగా ఉంటుందన్న సంకేతా లు మిత్రపక్షాల నుంచే రావడం. మొత్తంగా ఇన్ని పాజిటివిటీల మధ్య మహానాడుకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే సుమారు 5 లక్షల మంది వరకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలను పోగుచేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. దీనికి సంబంధించి రెండు మూడు కమిటీలు వేశారు. మరిన్ని కమిటీలను నేడో రేపో వేయనున్నారు. దీంతో మహానాడు సంబరం అదిరిపోయేలా ఉండాలని కోరుకుంటున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. కడపలో జరుగుతున్న మహానాడు వేడుకలకు సంబంధించిన పనుల్లో ఆ జిల్లా నాయకులు దూరంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. బీటెక్ రవి నుంచి ఎమ్మెల్యే మాధవి సహా పలువురు నాయకులు దూరంగా ఉన్నారు. దీనికి కారణం.. కమలాపురం ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి కి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారన్నది వీరి ఆగ్రహం. నిజానికి మహానాడు జరుగుతున్నది కమలాపురం నియోజకవర్గంలోనే. దీంతో స్థానిక ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించారు.
దీనిలో తమకు ఎలాంటికీలక పాత్ర అప్పగించలేదని..బీటెక్‌రవి వర్గం ఆరోపిస్తోంది. పైగా.. తమ కు కనీసం పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్ విషయం కూడా చెప్పలేదని.. అన్నీ వారే చేసుకుంటు న్నారని ఆరోపిస్తున్నారు. ఇక, ఎమ్మెల్యే మాధవి కూడా.. దాదాపు ఇదే చర్చ చేస్తున్నారు. తనను కొందరు దూరంగా ఉంచారని ఆమె వాదన వినిపిస్తున్నారు. దీంతో కడపలో జరుగుతున్న మహానాడు పనులకు వీరంతా దూరంగా ఉంటున్నారు. అయితే.. ఎవరు వచ్చినా.. రాకున్నా.. పనులు ఆగబోవని.. అధినేత తమకు అప్పగించిన పనులు పూర్తి చేస్తామని.. సతీష్‌రెడ్డి చెబుతున్నారు.