ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణ ఇలవేల్పుదేవత, ఉత్తరాన కొలువైయున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యసన్నిధిలో విశ్వావసు నామ సంవత్సర మొదటి పౌర్ణమి, చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని 74 వ పౌర్ణమి చండీహోమం వేదోక్తంగా, శాస్త్రోక్తంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) సారధ్యంలోని ఆలయకమిటీ ఘనంగా నిర్వహించింది.
డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) మాట్లాడుతూ అమ్మవారి కృపతో ఈరోజుకి 74 పౌర్ణమి చండీహోమాలు జరిగాయని, ప్రతీ పౌర్ణమికి సాయంత్రం చండీహోమం జరిపే సంప్రదాయం వీరంపాలెం బాలా త్రిపురసుందరీ పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి రూపొందించి ధార్మిక మార్గనిర్దేశం చేశారని తెలిపారు.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ మాట్లాడుతూ చండీహోమం మరియు ఆలయంలో జరిగే ప్రతీ కార్యక్రమంలో ఆలయకమిటీ చూపే శ్రద్ధ, భక్తులు అనుసరణీయమని, పూజాది కైంకర్యాలు అమ్మవారి శక్తిని మరింతగా భక్తులు అనుభూతి పొందేలా చేస్తున్నాయని, చైత్ర పౌర్ణమి విశిష్టతను తెలిపారు. ఆధ్యాత్మికవేత్త పీ.వీ.కృష్ణారావు చండీహోమ ప్రాశస్త్యాన్ని వివరించారు.
సాయంత్రం నాలుగు గంటలకు అర్చక స్వాముల బృందం మండపంలో ఉభయదారులు దూడే కనకదుర్గ సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు, వెన్నెల సత్యనారాయణ పద్మశ్రీ దంపతులు, గొట్టాపు వెంకట అప్పారావు నాగసత్యవతి దంపతులు(అశ్వారావుపేట) అనిశెట్టి వీరబాబు హేమలత దంపతులు(దొండపూడి) డోకల ఈశ్వర గణేష్ దుర్గాభవాని దంపతులు మరియు రావి రాఘవకుమార్ భవాని దంపతులచే ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచానం, మండపారాధన, మహాసంకల్పం చేయించి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి అనంతరం యాగశాలలో 74 వ పౌర్ణమి చండీహోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సభక్తిపూర్వకంగా సమర్పించారు.
హరే శ్రీనివాస శ్రీఅభయాంజనేయ కోలాట భజన బృందం చింతామణి, తాడేపల్లి ఉమాదేవి ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. నూకాంబికా మహిళా భక్త బృందం ధ్వజస్తంభం వద్ద పాలపొంగళ్ళు నిర్వహించారు. ప్రసాద వినియోగం జరిగింది.