డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కె.గంగవరం, బ్యూరో: తల్లిదండ్రులు లేని ఓ చిన్నారికి తాను అండగా ఉన్నా అంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించి తన మంచి మనసును చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే కె.గంగవరం మండలం పాతకోట గ్రామానికి చెందిన చిన్నారి తేజస్విని భీమవర్షిణి కు తల్లిదండ్రులు లేరు. ఆ చిన్నారి అమ్మమ్మ తాతయ్యలే పెంచి పోషిస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబ పరిస్థితిని కూటమి నాయకులు మంత్రి సుభాష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తక్షణం స్పందించిన మంత్రి సుభాష్ ఆ చిన్నారిని బాగా చదివించి, చక్కగా చూసుకొని ప్రయోజకరాలుని చేయాలని సూచిస్తూ రూ. 20వేల ఆర్థిక సహాయం అందించారు. అందరూ ఉన్నా కనీసం పట్టించుకోని ఈ రోజుల్లో కష్టం తెలుసుకుని ఆ చిన్నారికి ఆర్థిక సహాయం చేసిన మంత్రి సుభాష్ సేవా నిరతిని పలువురు కొనియాడుతున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, రామచంద్రపురం, బ్యూరో: వైద్యం ఖర్చుల నిమిత్తం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురికి రామచంద్రపురం హౌసింగ్ బోర్డు కాలనీ లోని క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెక్కులు పంపిణీ చేశారు.
లబ్ధిదారుల వివరాలు..
1. తిర్రి గంగాభవాని వెల్ల 1 గ్రామం, రామచంద్రపురం-43,400 రూపాయలు..
2. తడల అనంతలక్ష్మి కూళ్ళ గ్రామం, కే గంగవరం మండలం 18000 రూపాయలు
3. నల్లమిల్లి వీరలక్ష్మి , సెలపాక గ్రామం, కాజులూరు మండలం-2,79,142 రూపాయలు
4. యన్ రామకృష్ణ, కే గంగవరం గ్రామం, కే గంగవరం మండలం - 30,000 రూపాయలు
5. డి లక్ష్మీపతి, నరసాపురపుపేట గ్రామం, రామచంద్రపురం మండలం 35,205 రూపాయలు
మొత్తం 4,05,747 రూపాయలు చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు.
బాలా త్రిపుర సుందరి సోమేశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ నిర్మాణం
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, రామచంద్రపురం, బ్యూరో: మండలంలోని వెల్ల గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి నూతన ధ్వజస్తంభ నంది నవగ్రహ విగ్రహముల ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అతి వైభవముగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ వాసంశెట్టి సత్యం ఎమ్మెల్సీ వీరభత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వైసీపీ ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మండల అధ్యక్షులు అంబటి భవాని రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ గాదం శెట్టి శ్రీదేవి శ్రీధర్ పాల్గొని పూజల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ఎంపీటీసీలు కుటమి నాయకులు పాల్గొన్నారు.