ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్త్రంలో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఇచ్చిన హామీలే కాక ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని రానున్న ఎన్నికల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారని అన్నారు.
వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని పార్టీ జెండా ఆవిష్కరించి గ్రామంలో అందించిన సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ కె యస్ యస్ సుబ్బారావు, డ్వామా పీడీ...డివిజనల్ డవలప్మెంట్ అధికారి ఎబివిపి లక్ష్మి, దెందులూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అప్పన్న ప్రసాద్, ఎంపీపీ బత్తుల రత్నకుమారి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్, మండల సచివాలయం ల కన్వీనర్ అక్కినేని గోపి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కత్తుల రవి, సర్పంచ్ రంభ ఉమ మహేశ్వరి, దెందులూరు జడ్పిటిసి నిట్టా లీలా నవకాంతం, స్థానిక వైసిపి నాయకులు వైకుంఠపు ధనుంజయ్, సొంగల ఉమ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.