ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడి 90 సంవత్సరాలు అయింది. ప్రారంభం నాటి నుండి దున్నేవాడికి భూమి చెందాలని దళితులు, గిరిజనుల కోసం పోరాటం చేసిన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం. వ్యవసాయ కార్మిక సంఘం మాహసభ ఆహ్వాన సంఘం సమావేశం శనివారం రావులపాలెం జట్లు సంఘం ఆఫీస్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ భారత దేశంలో వ్యవసాయ కార్మికుల కోసం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాధించడంలో ఈ సంఘం చేసిన పోరాటం ఫలితం అని అన్నారు. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కోనసీమ ప్రాంతంలో వ్యవసాయ కార్మిక సంఘం ఎంతో బలమైనదని, జిల్లాలు విడిపోయిన తర్వాత జిల్లాలో నవంబర్ 11, 12 న జరగబోతున్న ప్రథమ జిల్లా మహాసభని విజయవంతంగా నిర్వహించాలని, జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేల వ్యవహరించ కూడదని ఈ మహాసభల సందర్భంగా పోరాటం చేద్దామని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ రామకృష్ణ, పార్టీ కార్యవర్గ సభ్యులు రవికుమార్, రాము, సమితి సభ్యులు వి. శామ్యూల్, రామిరెడ్డి, హేమ, కె. శ్యామ్ , కర్రీ రోజా తదితరులు పాల్గొన్నారు.