Hot Posts

6/recent/ticker-posts

నవంబర్ 7 చలో హైదరాబాద్ గోడ పత్రిక విడుదల చేసిన విస్సంపల్లి సిద్దు మాదిగ


ఏలూరు జిల్లా: టి నరసాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో మహాజన సోషలిస్టు పార్టీ ఎమ్మెస్ పి మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చాపలమడుగు రాంబాబు మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మహాజన సోషలిస్టు పార్టీ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి విస్సంపల్లి సిద్దు మాదిగ ముఖ్యఅతిథిగా హాజరైనారు. 


నవంబర్ 7 చలో హైదరాబాద్ గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘంగా మూడు దశాబ్దలపాటు పనిచేస్తున్నామని తెలిపారు. నవంబర్ లో జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పిన బిజెపి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న మౌనంగా ఉండడం అన్యాయమన్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనం వీడి వర్గీకరణపై మీ మీ విధానం ఏంటో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. నవంబర్ లో జరిగే మాదిగ విశ్వరూప మహాసభకు ప్రతి ఇంటి నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని తద్వారా వర్గీకరణ సాధిస్తే మాదిగ మరియు 58 ఉపకులాలు న్యాయం జరుగుతుందని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు జుజ్జువరపు వాసు చౌదరి ముదగళ్ల ముత్తయ్య, బొల్లా గంగాధర్, తడికమళ్ళ వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ చాపలమడుగు రామకృష్ణ, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.