ఈ సమావేశ అనంతరం పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గం శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు నియోజకవర్గ పరిధిలో గల ప్రజల, రైతుల సమస్యలను సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనువుగా సేవలు అందించడానికి శాసన సభ్యులు ఎంతగానో కృషిచేస్తున్నారని తెలిపారు. కైకలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను పూర్తిచేయవలసిన అవసరం, ఆసుపత్రుల సమస్యలపై శాసన సభ్యులు చర్చించడం జరిగిందని వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కైకలూరు రైతాంగానికి ఈ సంవత్సరం సాగునీరుకు కొరత ఏర్పడటం కారణంగా గత 4 సంవత్సరల కాలంగా సాగు నీరు అందించినప్పటికి, ప్రస్తుతం కృష్ణానది కాలువ నుండి రావల్సిన సాగునీరు సరఫరాలో రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారని శాసన సభ్యులు అంశాన్ని సమావేశం దృష్టికి తీసుకురాగా ఈ సంవత్సరంలో వర్షపాతం తక్కువగా ఉన్నకారణంగా కృష్ణానది సాగునీరు కొరత ఏర్పడిందని దీనిని దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ ఎస్ఇ ఈ రోజు నుండి 350 క్యూసెక్కుల నీరు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని యంపి తెలిపారు. ఈ సమస్యను పక్క నియోజకవర్గ నాయకులతో సంప్రదించి కైకలూరు డెల్టా ప్రాంతమైనందువల్ల శివారు భూములకు నీరు అందని కారణంగా ఎక్కువనీరు ఇవ్వడానికి అధికారులు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగిందని యంపి తెలిపారు.