నివారణకు సత్వర చర్యలు చేపట్టాలి.. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసిన ఐ ఎఫ్ టి యు, న్యూ డెమోక్రసీ నాయకులు
మణుగూరు: పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు అశ్వాపురం పినపాక మండలాలలో డెంగ్యూ మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయని ఐ ఎఫ్ టి యు న్యూ డెమోక్రసీ నాయకులు విచారం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు గ్రీవెన్స్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, అసిస్టెంట్ కలెక్టర్ రాంబాబు, డి.ఆర్.ఓ రవీంద్రనాథ్, జిల్లా హెల్త్ ఆఫీసర్ శిరీష గార్లకు వినతి పత్రాలు అందజేశారు,
ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకురాలు పెదగొని ఆదిలక్ష్మి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు, అశ్వాపురం పినపాక మండలాలతో పాటు భద్రాచలం బూర్గంపాడు మండలాల్లో డెంగ్యూ జ్వరాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయని డెంగ్యూ జ్వరాల బారిన పడి ఇటీవల కాలంలో అనేకమంది మృత్యువాత పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు సాధారణ సీజనల్ వైరల్ జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయన్నారు. ప్రత్యేకించి మణుగూరు తోపాటు మండల పరిధిలోని సింగరేణి నిర్వాసిత గ్రామాలైన కొత్త మల్లేపల్లి, అయోధ్య నగర్, జయశంకర్ నగర్, కెసిఆర్ నగర్ రైల్వే స్టేషన్ పద్మ గూడెం, కొత్త కొండాపురం, కొత్త కొమ్ముగూడెం, న్యూ యగ్గడి గూడెం తదితర గ్రామాలతో పాటు మణుగూరు పరిసర గ్రామాలలో వర్షాలకు జ్వర పీడితులు పెరిగిపోయారన్నారు. డెంగ్యూ జ్వరాలతో వృద్ధులు చిన్నారులు కూడా బెంబేలేత్తిపోతున్నారన్నారు,
శనివారం నాడు కూడా మణుగూరులోని జయశంకర్ నగర్ కు చెందిన మైపా వెంకటేష్(ఎస్సీ మాల) అనే ఒక యువకుడు చనిపోయాడని, అశ్వాపురం మండలం చింతిర్యాలలో ఇద్దరు, అమెర్థాలో ముగ్గురు, మల్లెల మడుగులో ముగ్గురు, చింత లక్ష్మీ నగర్ లో ఒకరు డెంగ్యూ వైరస్ తో చనిపోయారని వారు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా మల్లేపల్లి, అయోధ్య నగర్ లో డెంగ్యూ మహమ్మారితో అనేకమంది చనిపోవడంతో వారి కుటుంబాలు అనాధలుగా మిగిలిపోయారనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ సోకిందనే భయంతో ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయించడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం చేయించుకుని కొంతమంది క్షేమంగా తిరిగి రావటం మరి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతోందన్నారు, ఈ నేపథ్యంలో పినపాక నియోజకవర్గంలో డెంగ్యూ నివారణ చర్యలు చేపట్టడంతో పాటు డెంగ్యూ జ్వర పీడితులకు మెరుగైన వైద్యం అందజేయాలని మనవి చేస్తున్నామన్నారు, అలాగే డెంగ్యూ జ్వరాలతో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంభాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీంతోపాటు సారపాక నుండి మణుగూరు వరకు మణుగూరు నుండి బీటీపీఎస్ వరకు గల ప్రధాన రోడ్డు ఇరుకగా ఉండటం గుంతలు పడటంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రోడ్డు వెడల్పు తోపాటు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. హనుమాన్ టెంపుల్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు వెడల్పు చేయాలని ప్రమాదాలు నివారించాలని కోరారు, బుగ్గ ఖమ్మంతో ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందని అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రికి తీసుకువద్దామన్నా దారి లేని పరిస్థితి గ్రామాల్లో ఉందన్నారు, మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని కోరారు. ఈ వినతి పత్రం పై కలెక్టర్ సానుకూలంగా స్పందించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, అశ్వాపురం ఏరియా నాయకులు సాధన పల్లి రవి, న్యూ డెమోక్రసీ కార్యకర్తలు కె ధనలక్ష్మి, బండ్ల కలమ్మ, ఇరప పుల్లక్క, కారం నాగమణి, పొదెం వెంకటమ్మ, వల్లేపోగు వెంకటరమణ, కాసులు, చుక్కమ్మ, జానకమ్మ, మడకం రమేష్, భీమయ్య, కారం రమణ, నరసమ్మ, మడకం దేవయ్య, రామారావు,హెచ్ కాంతారావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.