ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సర్వే అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ ముటేషన్లను భూ యజమాన్యాల పరస్పర అంగీకారంతో 15 రోజుల్లో పరిష్కరించాలన్నారు. రెండవ దశలో జిల్లాకు 68 గ్రామాలను కేటాయించడం జరిగిందన్నారు. ఆర్వోఆర్ చట్ట ప్రకారం రెవెన్యూ రికార్డులు స్వచ్చీకరించాలని సూచించారు. ప్రతి దశలోనూ భూ యజమాన్యాలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సర్వే ఆఫ్ ఇండియా వారి సాంకేతిక సహకారంతో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ప్రతి దశను పటిష్టంగా అమలు చేయాలన్నారు. సర్వే ఆఫ్y బౌండరీస్ చట్ట ప్రకారం ప్రక్రియను సమర్థ వంతంగా నిర్వహించాలన్నారు. తొలుతగా సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత తమ హద్దులపై స్పష్టత ఉన్నది లేనిది భూ యజమానుల నుండి తెలుసుకోవాలన్నారు. రైతులకు సంబంధించిన అవరోధాలు అన్నిటిని తొలగించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయ సంచాలకులు ప్రభాకర్, కలెక్టరేట్ సెక్షన్ అధికారి రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.