ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో రెండు రోజులు క్రితం గిరిజన సంక్షేమ పాఠశాలలో అర్ధరాత్రి బాలుడి హత్య జరిగింది. ఈ సంఘటనపై జనసేన నాయకులు మండల అధ్యక్షులు తెల్లం రవి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు ఘటన స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. బాధలో ఉన్న తల్లితండ్రులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇలాంటి అవాంఛనియా సంఘటనలు జరగడం బాధాకరం అన్నారు.
ఇలాంటి విష సంసృతి ఏజెన్సీలో పాకడం చాలా దురదృష్టకారం అన్నారు. ఎందరో గొప్ప వ్యక్తులను తయారు చేసిన ఈ పాఠశాలలో ఇలా జరగడం విచారకరమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు భయబ్రాంతులకు గురికావద్దన్నారు. బాలుడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జనసేన అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపధ్యక్షులు తీగల గోపాలకృష్ణ, ఏలేటి ఏడుకొండలు, మదేపల్లి శ్రీను, M. బుచ్చిరాజు, మనోహర్, స్థానికులు సురేష్, నవీన్, తేజ, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.