Hot Posts

6/recent/ticker-posts

కన్నాపురంలో పోలవరం నియోజకవర్గ స్థాయిలో మండలాల మరియు గ్రామ కమిటీల సదస్సు నిర్వహించిన జనసేన నాయకులు

ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ స్థాయిలో మండలాల మరియు గ్రామ కమిటీల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి చిర్రి బాలరాజు, కరాటం ఉమా హాజరయ్యారు. ఏడు మండలాల అధ్యక్షులు, జిల్లా కమిటీ, లీగల్ సెల్ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీలు క్రియాశీల వాలంటీర్లు, సీనియర్ నాయకులు వీరమహిళలు భారీగా మీటింగ్ కు హాజరయ్యారు. 


రాబోయే 2024 ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలని కార్యచరణపై అలాగే నియోజకవర్గంలో ఉండే సమస్యలపై నేడు సభను ఉద్దేశించి చిర్రి బాలరాజు ప్రసంగించడం జరిగింది. జనసేన యొక్క మేనిఫెస్టోని వివరించి, పార్టీ యొక్క సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలని ముందుకు తీసుకువెళ్లాలని, నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో అందరూ పనిచేయాలని పోలవరంలో జనసేన పార్టీని గెలిపించుకొని నాయకుడికి మనం బహుమతిగా ఇద్దామని, అందుకోసం అందరి కృషి ఎంతో ముఖ్యమని అన్నారు.


ఇప్పటికే గ్రామ కమిటీలు ఏర్పాటు చేశామని మరికొద్ది రోజుల్లో కమిటీ పేర్లు ప్రకటిస్తామని, సోషల్ మీడియాలో జరిగేటువంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దని, పోలవరం నియోజకవర్గంలో కచ్చితంగా జనసేన వస్తుందని, త్వరలోనే వారాహి యాత్ర  రాబోతుందని అందుకు అందరం సంసిద్ధంగా ఉండాలని అన్నారు. ఇప్పటివరకు పడ్డ కష్టానికి మించి మరింత కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. 


టీ.నర్సాపురం మండలం, పోలవరం మండలం నుంచి తదితరులు జనసేన యొక్క సిద్ధాంతాలు నచ్చి కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్ సమక్షంలో పార్టీ కండువా పుచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వాలంటీర్లను  అభినందించారు.