జగనన్న తోడు పథకం ప్రభుత్వ ప్రధాన సామాజిక అభివృద్ధి పథకమన్నారు. జగనన్న తోడు పథకం ప్రారంభించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశంలో ఫుట్పాత్లో చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు మూలధన రుణాలు అందించడమని, గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయాలు పథకం యొక్క నోడల్ విభాగంగా వ్యవహరిస్తూ రెండు సచివాలయాలను ఒక బ్యాంకు బ్రాంచ్ తో మ్యాపింగ్ చేస్తూ రుణాలు కల్పన జరుగుతోందని, సకాలంలో రుణాలు ఒక ఏడాదిలో తిరిగి చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తుందని నిరుపేదలైన చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తులు, హస్త కళాకారులు వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఒక్కొక్కరికి రూ.10 వేలు వడ్డీ లేని రుణాలను అందిస్తోందన్నారు. చేతి వృత్తి పనివారు స్వయం వృద్ధి సాధించే దిశగా సకాలంలో రూ 10, వేలు తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు అదనంగా వెయ్యి రూపాయలు జోడించి రూ.13వేలు వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ మాట్లాడుతూ పథకాల పరంపరకు రూపకర్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సంక్షేమ కార్యక్రమాలను మహిళల పేరిట ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి మహిళ కుటుంబాన్ని చక్కదిద్దుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సంక్షేమాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర పేద ప్రజలలో ఆత్మగౌరవం విశ్వసనీయత పెంపొందించే దిశగా పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా జీవనోపాదులను పెంపొందించడం జరుగుతుందన్నారు పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా చిరు వ్యాపారుల పరిస్థితిని సమూలంగా మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేస్తోoదన్నారు. డిఆర్డిఏ పథక సంచాలకులు వి శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ 22
జిల్లాల పరిధిలో వడ్డీ రాయితీ కింద 13,758 లబ్ధిదారులకుగాను రూ.30 లక్షల 78 వేల 936 రూపాయలు జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు లక్ష, 2 వేల 426 లబ్ధిదారులకు రుణాల కల్పన ద్వారా రూ.102.42 కోట్లు లబ్ధిచేకూరిందని ఆయన తెలిపారు. వీరికి వడ్డీ రాయితీ కింద రూ 2 కోట్ల 58 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏడవ దశలో 14,431 మంది చిరు వ్యాపారులకుగాను రూ.15 కోట్ల 54 లక్షల పదివేలు రుణాల కల్పనకు ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ స్పందనను తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహిళలు వారి కుటుంబాల పాలిట గొప్ప వరంగా మారాయని అభిప్రాయాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కె. సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్, పి గన్నవరం శాసనస భ్యులు కే చిట్టిబాబు, హితకారిణి సమాజం చైర్మన్ కాశీ బాలముని కుమారి, వక్స్ బోర్డ్ చైర్ పర్సన్ షేక్ అబ్దుల్ ఖాదర్, దృశ్యకళల అకాడ మీ చైర్మన్ కే సత్య శైలజ, పురపాలక సంఘ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, తదితరులు పాల్గొన్నారు.