Hot Posts

6/recent/ticker-posts

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై వివిధ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

 


అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: ఈనెల 26వ తేదీన కోనసీమ జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దిగ్విజయం చేసేందుకు జిల్లా స్థాయి అధికారులకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు వివిధ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై విధులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలిపాడ్ స్థానిక పోలీస్ గ్రౌండ్ నందు నిర్మించాలని రహదారులు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అవసరమైన అంతర్గత రహదారులు కూడా నిర్మించాలని ఆదేశించారు స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియం నందు శానిటేషన్, ట్రీ కటింగ్లను డిపిఓ, మున్సిపల్ అధికారులు చేపట్టాలని సూచించారు.


ముఖ్యమంత్రి ఉండడానికి గ్రీన్ రూమును డీఎస్ఓ అన్ని సౌకర్యాలతో  ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వి వి ఐ పి లకు ప్రోటోకాల్ ప్రయాణించేందుకు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యమంత్రివర్యుల మకాం కొరకు స్థానికంగా ఏర్పాట్లు చేయాలని స్థానిక తహసిల్దారును ఆదేశించారు. ట్రాన్స్కో విభాగంవారు నిరంతరాయంగా పవర్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన మార్గంలో రోడ్డు డివైడర్లు ఫుట్పాత్ల రిపేర్లు చేపట్టాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై ఎగ్జిబిషన్ స్టాల్స్, ఏర్పాటు  24 మంది స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులతో ఫోటో తీసేందుకు ఏర్పాటు చేయాలని, జిల్లా విద్యాశాఖ అధికారి సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, సి ఎఫ్ ఎం ఎస్ ప్రతినిధులకు మకాo ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కాన్వాయ్ మరియు ఎస్ హెచ్ జి మహిళల తరలింపులు కొరకు బస్సులు ఏర్పాటు చేయాలని డిపిఓ ప్రతాప్ రావు ఆదేశించారు. 


వాహనాల పార్కింగ్ కొరకు మూడు జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 500 మంది గ్రామ వాలంటీర్లను నియమించాలని, గ్రీవెన్స్ సేకరణకు ప్రత్యేక అధికారులను నియమించారు. సమావేశానికి హాజరైన వారికి భోజన, అల్పాహార ఏర్పాట్లు చేయాలని స్థానిక ఆర్డిఓ వసంత రాయుడును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.