ఇందులో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా శాసన సభ్యులు ప్రభుత్వ అధికారులతో ఇంటింటికి వెళ్లి స్వయంగా వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం ప్రతి సచివాలయం పరిధిలో వాలంటీర్ల ద్వారా ముందుగానే 11 అంశాలతో కూడిన ప్రభుత్వ సర్టిఫికెట్ల సమస్యలను తెలిసికొని వారికి అందజేసే ఈ కార్యక్రమం మంచి స్పందన వచ్చిందని తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు తీసే సమయంలో విద్యార్ధులకు అవసరమైన సర్టిఫికెట్లను అందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రతివారం జిల్లాలోని ఒకోక్క నియోజకవర్గానికి సంబంధించిన పనుల పురోగతి, సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి జిల్లాల వారీగా ఇంఛార్జి మంత్రి సమక్షంలో జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలనే ఆదేశాలు మేరకు మొదటిగా దెందులూరు నియోజకవర్గం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లుతెలిపారు.
ఈ సమీక్షలో నియోజకవర్గంలో విద్యుత్ లో ఓల్టేజీని అధికమించడానికి 33 కెవి సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేయడానికి శాసన సభ్యులు ప్రతిపాధించిన మూడు గ్రామాల్లో భూమిని గుర్తించి 3 నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే తమ్మిలేరు కాలువ మాదేపల్లి నుండి శ్రీపార్రు వరకు రెండుకి రిటైనింగ్ వాల్ నిర్మాణంపైన, గోదావరి, కృష్ణా, పోలవరం, సాగునీటి పైన, నియోజకవర్గంలో రీ సర్వే కు సంబంధించిన అంశాలపైన, 22-ఎ పెండింగ్ ప్రతిపాధనలపైనా, షరతులుగల పట్టాలు గురించి, హౌసింగ్ పట్టాల పంపిణీ, హౌసింగ్ నిర్మాణ పురోగతి, ఇంటర్నల్ రోడ్లు గురించి, పియంఎవై పధకం పైనా, ఆర్ డబ్ల్యూఎస్ కు సంబంధించి సిపిడబ్ల్యూఎస్ స్కీం మీద, ఓవర్ హెడ్ ట్యాంకులు, నాడు-నేడు పనులు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నికల్ కాలేజీలు, రైతుల సమస్యలు, నర్సరీ ఆయిల్ ఫామ్, సీడ్స్, ఎరువులు, పంచాయితీరాజ్ సిసి రోడ్లు, డంప్ యార్డ్ లు, పరిశ్రమలు, ఎలక్ట్రికల్ పోల్స్, జి.జి.యంపి గ్రీవెన్స్, ఆర్ అండ్ బి రోడ్లు, ఎన్ ఆర్ జిఎస్ రోడ్లు, జలకళ, తదితర అంశాలపై సమీక్ష చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యల పెండింగ్ ల పైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, గ్రామాల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను సెప్టెంబరు 15వ తేదీ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని ఆ మేరకు పనులు పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాస్ధాయిలో పరిష్కరించలేని అంశాలను ప్రభుత్వ ఛీప్ సెక్రటరీకి తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం దెందులూరు శాసన సభ్యులు కొఠారి అబ్బయ్య చౌదరి పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షకార్యక్రమాల ద్వారా ప్రజల సంక్షేమ పధకాలు అందించడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గ స్ధాయిలో ఇంఛార్జి మంత్రి సమక్షంలో సమీక్షలు నిర్వహించమని జి.ఓ. విడుదలచేశారని తెలిపారు.
అందులో భాగంగానే ఈ రోజు దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో 10 వేలు ఇళ్లు నిర్మాణం పూర్తిచేయడానికి ఇంఛార్జి మంత్రి, కలెక్టర్ సమక్షంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దెందులూరులో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. అలాగే రైతులకు 6 వేల క్యూసెక్ ల గోదావరి నీరు విడుదలచేయడం జరిగిందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కోపరేటివ్ సొసైటి కి సంబంధించిన సమస్యల విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫామాయిల్ మొక్కలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గాలను అభివృద్ధి పధంలో ఉంచడానికి ముఖ్యమంత్రి ధృడ సంకల్పంతో ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ జిల్లా ఇంఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ కు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎవిఎన్ఎస్ మూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్, నియోజకవర్గంలోని జెడ్పిటిసిలు, యంపిపిలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా వివిధ శాఖల అధికారులు, డివిజన్ స్ధాయి అధికారులు, మండల స్ధాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.