ఏలూరుజిల్లా చింతలపూడి: చింతలపూడి జడ్జి C. మధుబాబు ఛైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవల కమిటీ వారు సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న ముద్దాయిలకు అందుచూన్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు గురించి, వారి కేసులు వివరములు అడిగి తెలుసుకుని చెడు పనులు చేసి జైలుకు రాకూడదనీ, ఇప్పటికయినా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని కష్ట పడి పనిచేసుకునీ కుటుంబాన్ని పోషించుకుని గ్రామాలలో గౌరవంగా బ్రతకాలని తెలిపారు, ఎవరికయినా న్యాయవాదిని పెట్టుకునే ఆర్ధిక పరిస్తితి లేనపుడు మండల న్యాయ సేవల కమిటీ ద్వారా న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని అలాగే శిక్ష పడిన ముద్దాయిలకు కూడా అప్పీల్ చేయుటకు ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని తెలిపారు.
ప్రజలనుద్దేశించి కష్టపడకుండా డబ్బులు సంపాదించ లేరని అలాగని అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించాలని అనుకుంటే జైలు లో వుండాల్సి వస్తుందని అలాగే చింతలపూడి కోర్టు పరిధిలో వున్న కక్షీదారులకు పత్రిక ముఖంగా తెలియ చేయునది ది 9.9.2023 న కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు రాజీ చేసుకుని విలువైన సమయము డబ్బు ఆదా చేసుకుని గ్రామాలలో ప్రశాంతంగా జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జి మధు బాబు ఛైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి, జైల్ విసిట్ ప్యానల్ న్యాయవాదులు బుల్లా ఏసుపాధం, పారా లీగల్ వాలంటీర్ Md అక్బర్ అలీ, జైలు సూపరింటెండెంట్ గోలి వెంకటేశ్వర రావు, హేడ్ వార్డర్ సాంబశివ రావు పాల్గొన్నారు.