Hot Posts

6/recent/ticker-posts

గోపన్నపాలెం సచివాలయం నందు న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్


ఏలూరు/ దెందులూరు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశాల మేరకు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజిత న్యాయ సేవలు శాశ్వత లోక్ అదాలత్ చైర్ పర్సన్ శ్రీమతి ఏ.మేరీ గ్రేస్ కుమారి అధ్యక్షతన బుధవారం దెందులూరు మండలం గోపన్నపాలెం సచివాలయం నందు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన గ్రామస్తులు, గ్రామ వాలంటీర్లు,  సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారం నిమిత్తం శాశ్వత లోక్  అదాలత్ ఏర్పాటు చేశారని ఈ శాశ్వత లోక్ అదాలత్  నందు రవాణా, పోస్టల్, ఇన్సూరెన్స్, వైద్య, విద్య, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఎన్ఆర్ఈజీఎస్, హౌసింగ్ రియల్ ఎస్టేట్,  మరియు పారిశుద్ధ్యం మొదలైన సేవలలో లోపం జరిగినప్పుడు ఈ శాశ్వత లోక్ అదాలత్ నందు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ శాశ్వత లోక్ అదాలత్ నందు అన్ని సేవలు ఉచితంగా అందించబడునని, అలాగే ఆర్థికంగా వెనుకబడిన పేద, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని, తెలుసో తెలియక చిన్న చిన్న గొడవలకు కోర్టులను ఆశ్రయించి డబ్బు, సమయం వృధా చేసుకోకుండా,  సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సంప్రదించాలని సూచించారు. అలాగే డిప్యూటీ లీగల్ ఏ డిఫెన్స్ కౌన్సిల్ బి.రామ మోహన్ రావు మాట్లాడుతూ ఖైదీలకు మరియు అర్హత కలిగిన ముద్దాయిలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా ఉచితగా కేసులు వాదించడం జరుగుతుందని, దీని నిమిత్తం చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మరియు అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

ఈ వ్యవస్థ ద్వారా ముద్దాయిలకు మరియు ఖైదీలకు నాణ్యమైన ఉచిత సేవలు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి కేసులో ముద్దాయి, నేరస్తుడు కాదని, నేరము మోపబడిన వ్యక్తిని  అటువంటి వారు కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి అర్హులని కావున అవసరమైన వారు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమును ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి శ్రీమతి కె. నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.