ఏలూరు: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్దుల కోసం ఉచిత మెగా డిఎస్సీ క్రాష్ కోర్సు శిక్షణను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఎడి బి. రామ్ కుమార్ తెలిపారు. ద్రృష్టి లోపం, వినికిడి లోపం, శారీరక వైకల్యం కలిగిన విభిన్న ప్రతిభావంతులైన ఎస్ జిటి టీచర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్ధుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేయబడిందన్నారు.
ఈ కోర్సుకు దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా అనగా mdfc.apcfss.in వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చుని, కనీసం 40% శాతం వైకల్యం కలిగిన వారు మాత్రమే అర్హులన్నారు. శిక్షణ కొరకు ఎంపిక టెట్ స్కోర్ ఆధారంగా జరగనుందన్నారు. ఎంపిక అయిన అభ్యర్ధులకు ప్రత్యేక బోధనా పద్ధతులలో శిక్షణ, స్టడీ మెటీరియల్స్, ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించబడతాయన్నారు.
ఈ విలువైన అవకాశాన్ని జిల్లాలోని అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులైన మెగా డిఎస్సీ అభ్యర్ధులు సద్వినియోగ పరచుకొని వారి భవిష్యత్తును మెరుగుపరచు కోవలసిందిగా ఆయన కోరారు.