డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ద్రాక్షారామం: ఆధునిక భారతావనిలో హిందుత్వ వ్యతిరేక కుల నిర్మూలనా పోరాటానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని నియోజకవర్గం ఎం.బి.సి సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు.
పూలే 198వ జయంతి సందర్భంగా ద్రాక్షారామం మసీదు సెంటర్ లో ఉన్న పూలే దంపతులు విగ్రహాలుకు ప్రజా సంఘాలు నాయకులు నూకల బలరాం, వెంటపల్లి బీమశంకరం, బి.సిద్ధూ, కొల్లపు కామేశ్వరరావు, యాట్ల అప్పారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులలు అర్పించారు.
అనంతరం యాట్ల మాట్లాడుతూ కులవ్యవస్తకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ స్తాపించి తన భార్య సావిత్రీబాయి పూలే తో ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థినులకు విద్యాబ్యాసం నేర్పించి ఉన్నత స్థానాలకు తీసుకువచ్చిన మహనీయులని, ఆయన రచించిన గులాంగిరి పుస్తకం అత్యంత ప్రఖ్యాత పొందిందని అన్నారు. ఆయన జయంతి రోజున ప్రభుత్వం శెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అనంతరం పూలే జీవిత చరిత్ర కు సంబంధించిన నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేమవరపు రాంబాబు, గారోజు సూరిబాబు, బిల్లకుర్తి స్వామి, మేడిశెట్టి శ్రీనివాస్, షేక్ గులాబ్, కొత్తగళ్ల భీమ శంకరం శివరాం, కె.వెంకటేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.