ఏలూరు జిల్లా చింతలపూడి: మండలంలోని కాంతంపాలెంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ప్రతిష్ట చేశారు. బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేవని చింతలపూడి సొసైటీ చైర్మన్ ఆతుకురు సుబ్బారావు అన్నారు. చింతలపూడి మండలం కాంతంపాలెం గ్రామంలో బాబు జగజ్జివన్ రావు విగ్రహాన్ని కాంతం పాలెం మాదిగ యువసేన యూత్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఆతుకురు సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ (1908-1986) ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు సంఘ సంస్కర్త. అతను బీహార్‌లో జన్మించాడు మరియు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. "అణగారిన తరగతుల ఛాంపియన్" అని పిలువబడే రామ్ అణగారిన వర్గాల హక్కులు మరియు సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడారు, ముఖ్యంగా దళితులలో అయన భారత జాతీయ కాంగ్రెస్ మరియు కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు, రక్షణ మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి, లౌకికవాదం పట్ల ఆయన నిబద్ధత మరియు దేశ నిర్మాణం పట్ల ఆయన చేసిన కృషి భారతీయ సమాజంపై శాశ్వత ప్రభావాన్ని చూపి, భారత చరిత్రలో ఆయనను గౌరవనీయ వ్యక్తిగా గుర్తించడం జరిగిందని ఆతుకురు సుబ్బారావు అన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శేఖర్ మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అమలుపరచడంలో బాబు జగజ్జివన్ రావు ముఖ్యపాత్ర వహించారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా దళిత జాతి అభివృద్ధికి కృషి చేశారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలపాల సురేష్ మాదిగ, ముప్పిడి శామ్యూల్, ఎస్సై ముప్పిడి జాషువా, కాంతంపాలెం గ్రామస్తులు నేమకూరి సర్వేశ్వరరావు, తనకి సురేష్, దుక్కుపాటి చిన్న, దోనేటి పెద్ద మారేష్ యూత్ సభ్యులు, తాళ్లూరు ఏసేపు, దోనేటి శ్రీనివాసరావు, దుక్కపాటి సందీప్, హరీష్, నితిన్, నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.