అవును... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేదికరలో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. ఇందులో భాగంగా...తొలుత అంతర్వేదికరలో వంగవీటి రంగ విగ్రహాన్ని కాపు సంఘాలు ఏర్పాటు చేశాయి. అయితే.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని పోలీసులు దాన్ని తొలగించారు.
అయితే.. గ్రామ పంచాయతీ నుంచి అనుమతి ఉందంటూ కాపు సంఘాల నేతలు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు! పోలీసులు విగ్రహాన్ని తొలగించడంతో తెల్లవారుజాము నుంచి కాపు సంఘాల నేతలు ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగ నినాదాలు చేస్తున్నారు! ఈ సమయంలో.. విగ్రహాన్ని తిరిగి అదే ప్లేసులో పెట్టడానికి కాపు నేతలు ప్రయత్నించారు.
అయితే.. కాపు సంఘం నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. కాపు సంఘాల నేతలు విగ్రహాన్ని ఇదే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కాపు సంఘాలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో రంగా విగ్రహం చేయి విరిగిపోయింది. ఈ సమయంలో ఎస్సీ సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి!
ఇందులో భాగంగా... అంబేద్కర్ విగ్రహం పక్కన వంగవీటి రంగా విగ్రహం పెట్టకూడదని ఆందోళన చేపట్టాయి. ఇలా ఘటనస్థలికి ఇరువర్గాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో సఖినేటిపల్లి మండలం, అంతర్వేదికరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి!
డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత వంగవీటి రంగా విగ్రహం తొలగింపుతో కాపు సంఘాలు ఆందోళన.
— Tupaki (@tupaki_official) May 29, 2025
అంతర్వేదికరలో కాపు సంఘాలు ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహానికి అధికారులు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు తొలగించారు.
తీవ్రంగా అభ్యంతరం తెలిపిన కాపు సంఘాల నాయకులు పోలీసుల… pic.twitter.com/AjkADXXqD0