తాజా వార్తలు

10/recent/ticker-posts

బుంగా కుటుంబ వివాహంలో డా. చల్లా ప్రభాకర్‌రావు పాల్గొని ఆశీర్వాదం


ఆలమూరు, పశ్చిమ వాహిని, మే 01: ఆలమూరు మండల కేంద్రంలోని ఎస్‌వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బుంగా కుటుంబ వివాహ వేడుక ఘనంగా జరిగింది. బుంగా జోసెఫ్, జయశ్రీ దంపతుల కుమార్తె లక్కీ ప్రియ – రాజేష్ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.


ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ట్రెజరర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త మరియు జాతీయ సేవా పురస్కార్ గ్రహీత డా. చల్లా ప్రభాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చల్లా నానాజీ, చల్లా భూషణం, చల్లా సుధీర్ కుమార్, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు బుంగా సంజయ్, గుమ్మిలేరు మాజీ సర్పంచ్ గుణ్ణం రాంబాబు, ఆలమూరు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ వంటిపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎలుగుబంట్ల సాయిబాబు, ఎలుగుబంట్ల రామయ్య, సామంతుల నాని, ఎరుకొండ గణేష్, లంకే వెంకటరెడ్డి, శ్రీపతి వీర్రాజు, చిన్నం హరిబాబు, రావూరి శివ, నార్గని సెంటిల్ కుమార్, నామాల ఏసురాజు (సాక్షి రాజు) తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.