తాజా వార్తలు

10/recent/ticker-posts

లింగపాలెం గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం – విద్యార్థులకు జీకే పోటీలు


లింగపాలెం, పశ్చిమ వాహిని, మే 04: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం జనరల్ నాలెడ్జ్ (GK) మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారులు విద్యార్థులకు లైబ్రరీ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే జనరల్ నాలెడ్జ్ ఎంతో కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ పరీక్షలకు ఇది బలమైన పునాది అవుతుందని వివరించారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

శిబిరం ముగిసిన అనంతరం విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి ఎ.ఎస్.ఏ. లతీఫ్, రిసోర్స్ పర్సన్ టీ. తరుణ్ మరియు గ్రంథాలయ సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల్లో విజ్ఞానాభివృద్ధి మరియు పోటీ తత్వాన్ని పెంపొందించేలా ఈ శిబిరం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.