తాజా వార్తలు

10/recent/ticker-posts

రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..


ఆంధ్రప్రదేశ్,అమరావతి, APRIL, 29: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది.. టెన్త్‌ ఫలితాలు రేపు అనగా మార్చి 2026 ఫలితాలను ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.


విద్యార్థులు తమ ఫలితాలను పలు మార్గాల్లో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. SSC ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ సేవలో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. అదనంగా LEAP మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. డిజిలాకర్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో కూడా మార్కుల మెమోలు అందుబాటులో ఉండనున్నాయి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌..

ఇక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ తమ స్కూల్ లాగిన్‌ల ద్వారా ఫలితాలను విడుదలైన వెంటనే డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది అని తెలిపారు.. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశం ఇచ్చారు మంత్రి లోకేష్… లక్ష్యాలను సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ.. ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడవద్దని, ఇది జీవిత ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్‌..