తాజా వార్తలు

10/recent/ticker-posts

అజరయ్యపేటలో తొమ్మిదేళ్ళ అనంతరం రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారాములవారి కళ్యాణం


నూజివీడు, పశ్చిమ వాహిని, మార్చి 27: పట్టణంలోని అజరయ్యపేటలో తొమ్మిదేళ్ళ అనంతరం రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారాములవారి కళ్యాణం ఘణంగా జరిగింది.

1982వ సంవత్సరంలో ప్రతిష్టించబడిన ఈ రామాలయం 2017వ సంవత్సరం పూజలు అందుకున్న వైనం.. అప్పటి నుండి నేటి వరకు మూతపడిన ఈ రామాలయాన్ని స్థానికుల సహకారంతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రముఖ న్యాయవాది ఎల్ సి హెచ్ వెంకటేశ్వరరావు సీతారాముల సమేతంగా లక్షణస్వామి, హనుమంతుని విగ్రహాలను స్థానికుల సహకారంతో పునఃప్రతిష్ట చేయడం జరిగింది.

తొమ్మిదేళ్ళ పాటు నిరాదరణకు గురైన ఈ ఆలయంలో పూజలు, రాములవారి కళ్యాణం జరుపుకోవడానికి అవకాశం రావడం మహద్భాగ్యంగా స్థానికులు భావిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది దొరై సహకారంతో ఆలయంలో స్వామివార్ల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు న్యాయవాది వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా సీతారాముల వారి కళ్యాణం జరపడంతో పాటు ఆలయంలో పూజలు కూడా నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తెలిపారు.

గతంలో రాములవారి ఆలయం చుట్టు పక్కల అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఉండేదని, నేడు సీతారాముల కల్యాణం జరుపుకోవడం ఆనందంగా ఉందని పులపాక యుగంధర్ సాయికృష్ణ తెలిపారు. హైందవులు అందరూ ఏకమై మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను ఆధునీకరించి, నిత్యం పూజలు అందుకునేలా చెయ్యాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కళ్యాణం అనంతరం భక్తులకు పానకం, ప్రసాదాన్ని ఆలయ కమిటీ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని పలువురు భక్తులు పాల్గొన్నారు.