తాజా వార్తలు

10/recent/ticker-posts

నూజివీడులో ‘మన్ కీ బాత్’ వీక్షణ – విద్యపై ప్రధాని మోడీ సందేశాలు


నూజివీడు, పశ్చిమ వాహిని మార్చి 29: పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు హాస్టల్‌లో 8, 9వ తరగతి బాలికలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ 132వ ఎపిసోడ్‌ను వీక్షించారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ విద్యను కేవలం పుస్తక జ్ఞానంగా కాకుండా జీవన నైపుణ్యాలను పెంపొందించే సాధనంగా భావిస్తున్నారని తెలిపారు. స్కిల్ ఇండియా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు.

డిజిటల్ లెర్నింగ్, ఆన్లైన్ విద్య, మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని సూచిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు మార్కులకు మాత్రమే పరిమితం కాకుండా సృజనాత్మకత, క్రీడలు, కళలు, నైతిక విలువలలో కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి నెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని విద్యార్థులకు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా చూపిస్తున్నామని చెప్పారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు సాధారణ జ్ఞానంపై ప్రశ్నలు అడిగి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గురుకుల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.